: 'స్పెక్టర్'ను పెద్దగా కత్తిరించలేదు: స్పందించిన సెన్సార్ బోర్డు
నేడు దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలవుతున్న డానియల్ క్రెయిగ్ నటించిన జేమ్స్ బాండ్ తాజా చిత్రం 'స్పెక్టర్'కు సెన్సార్ సభ్యుల కటింగ్స్ పై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతుండటంపై సెన్సార్ బోర్డు స్పందించింది. తాము ఆ చిత్రంలో కథ దెబ్బతినేలా ఎటువంటి కటింగ్స్ చెప్పలేదని, రెండు 'పెదవుల ముద్దు' సన్నివేశాల నిడివిని మాత్రం తగ్గించామని, మరో రెండు చోట్ల, ఇండియాలో అభ్యంతరకరం అనుకున్న పదాలను 'మ్యూట్' చేశామని ఈ ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది. బాండ్ చిత్రాలకు ఇండియాలో ఉన్న విలువ తమకు తెలుసునని వ్యాఖ్యానించింది. అనేక సన్నివేశాలను తొలగించారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది.