: టీఆర్ఎస్, వైకాపాల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది: టి.కాంగ్రెస్


తెలంగాణలో అధికార పక్షం టీఆర్ఎస్ కు, వైకాపాకు మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకే వైకాపాను ఎన్నికల బరిలోకి ముఖ్యమంత్రి కేసీఆర్ దింపారని అన్నారు. ప్రచారంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలని వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన లైట్ గా తీసుకున్నారు. జగన్ మాటల్లో నిజం లేదని అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ కూడా జగన్ ను ఒక్క మాట అనలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయని చెప్పారు.

  • Loading...

More Telugu News