: మాజీ కోచ్ బుచానన్ ను తన పెంపుడు కుక్కతో పోల్చిన మైఖేల్ క్లార్క్


రికీ పాంటింగ్ తనను హార్బర్ బ్రిడ్జిపై నుంచి నదిలో దూకమన్నా దూకుతానని చెప్పే ఆస్ట్రేలియన్ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ తన తాజా పుస్తకంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల 'యాషెస్ డైరీ 2015' పుస్తకం రాసిన ఆయన అందులో పలు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మాజీ కోచ్ జాన్ బుచానన్ పై అంతెత్తున లేచాడు. బుచానన్ కన్నా తన పెంపుడు కుక్క 'జెర్రీ', ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మెరుగైన కోచింగ్ ఇవ్వగలదని అన్నాడు. దేశానికి ఆడుతూ కూడా మందు కొట్టి వచ్చే సైమండ్స్ కు తనను విమర్శించే హక్కు లేదని విరుచుకుపడ్డాడు. మరొకరి నాయకత్వ లక్షణాలను విమర్శించేంత గొప్పవాడు కాదని అన్నాడు. పనిలో పనిగా, హెడెన్ పైనా విమర్శలు చేశాడు. తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో విమర్శించిన వారందరినీ ఈ పుస్తకంలో ప్రస్తావిస్తూ, ప్రతి విమర్శలే సమాధానంగా చెప్పుకొచ్చాడు. దీంతో ప్రపంచ క్రికెట్ వర్గాల్లో క్లార్క్ తాజా పుస్తకం కొత్త చర్చగా మారింది.

  • Loading...

More Telugu News