: ఇండియాపై దాడుల కోసం కలుస్తున్న లష్కరే తోయిబా, ఐఎస్ఐఎస్!


భారత్ లో ఉగ్రదాడులు జరిపి పెను విధ్వంసం సృష్టించాలన్నదే లక్ష్యంగా పాక్ కేంద్రంగా నడుస్తున్న లష్కరే తోయిబా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలు చేతులు కలపనున్నట్టు సమాచారముందని ఓ సీనియర్ సైన్యాధికారి తెలిపారు. అన్ని దేశాల్లో దాడులకు యత్నిస్తున్న వారు లష్కర్ తో చేతులు కలిపే అవకాశముందని ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఆర్ఆర్ నింభోర్కర్ జమ్మూలో మీడియాకు తెలిపారు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీరులో 700 మంది వరకూ ఉగ్రవాదులు ఉన్నారని ఆయన అన్నారు. వీరంతా ఇండియాలోకి చొరబడేందుకు అవకాశం కోసం వేచి చూస్తున్నారని, పారిస్ తరహా దాడులకు వారు కుట్ర చేస్తుండవచ్చని అంచనా వేశారు. వీరికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు 35 వరకూ టెర్రరిస్టు క్యాంపులు పని చేస్తున్నాయని తెలిపారు. మరింత మందిని రిక్రూట్ చేసుకుంటున్నారని, వారికి పాక్ ప్రభుత్వమే నిధులందిస్తోందన్న అనుమానాలున్నాయని నింభోర్కర్ వివరించారు.

  • Loading...

More Telugu News