: రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పై కేసు కొట్టివేత


దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ పై విచారణలో ఉన్న ఓ చెక్ బౌన్సు కేసును యలమంచిలి కోర్టు కొట్టివేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుకు ఆయన 2011 మే 16న రూ. 30 లక్షల చెక్కు ఇచ్చారు. దాన్ని నగదుగా మార్చుకునేందుకు ఆంధ్రాబ్యాంకుకు వెంకట్రావు వెళ్లగా, అది చెల్లలేదు. దీంతో ఆయన ఏజేఎఫ్సీఎం కోర్టులో కేసు వేశారు. దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగా విచారణ జరుగగా, వాద, ప్రతివాదనల అనంతరం, సరైన ఆధారాలు లేవని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి యజ్ఞనారాయణ, విజయేంద్ర ప్రసాద్ ను నిర్దోషిగా ప్రకటించారు.

  • Loading...

More Telugu News