: పెట్టుబడులకు అనుకూల వాతావరణం కావాలి: అరుణ్ జైట్లీ
భారత్ కు పెట్టుబడులు రావాలంటే అందుకు అనుకూలమైన వాతావరణం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రాజస్ధాన్ లోని జైపూర్ లో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరాలంటే పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం అవసరమని అన్నారు. భారత్ లో ఉన్న సహజ వనరులు పెట్టుబడులు వచ్చేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్న ఆయన, ఆ పెట్టుబడులు వెనుదిరగకుండా ఉండాలంటే నిబంధనలు సరళతరం చేసి, సత్వర అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. పన్నులు కూడా ఓ స్థాయిని మించకూడదని ఆయన పేర్కొన్నారు. అలాంటప్పుడే పెట్టుబడులు వస్తాయని ఆయన చెప్పారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి రహితంగా పని చేయాలని ఆయన సూచించారు.