: అతనితో విభేదాలు పోయేందుకే ఇలా పోరాడుతా: రాజమౌళి
పోరాటం అనేది తనకు చాలా అవసరమని ప్రముఖ దర్శకుడు రాజమౌళి చెబుతున్నాడు. సోషల్ మీడియా ద్వారా బాహుబలికి విశేషమైన ఆదరణ తీసుకువచ్చిన రాజమౌళి, బాహుబలి సీక్వెల్ కు అంత కంటే ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎప్పటి కప్పుడు బాహుబలి 2 విశేషాలు పంచుకుంటూ ఆసక్తి రేకెత్తించడం, అభిమానుల మదిలోంచి దాని ప్రభావం కనుమరుగు కాకుండా చూడడం కర్తవ్యంగా భావించే రాజమౌళి, తాజాగా ఓ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. బాహుబలి కెమెరా మెన్ సెంథిల్ తో రాజమౌళి పోరాడుతున్న దృశ్యం ఇది. కెమెరామెన్ తో తలెత్తే క్రియేటివ్ విభేదాలను ఇలా పరిష్కరించుకుంటానని రాజమౌళి సరదాగా కాప్షన్ పెట్టాడు. ఇది రాజమౌళి అభిమానులను ఆకట్టుకుంటోంది.