: షీనా బోరా హత్య కేసులో కొత్త ట్విస్ట్...పీటర్ ముఖర్జియా అరెస్ట్
ముంబై, కార్పొరేట్ వరల్డ్ లో సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. రాయగఢ్ అడవుల్లో లభించిన పుర్రె, ఎముకలు షీనా బోరావేనని, గొంతు నులమడం ద్వారా షీనా బోరా మృతి చెందిందని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇదే రోజు ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు పీటర్ ముఖర్జియాను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టులు నాలుగుకు చేరుకున్నాయి. తొలుత ఇంద్రాణి ముఖర్జియాతో బాటు ఆమె డ్రైవర్ శ్యామ్ రాయ్, ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నాలను అరెస్టు చేసి విచారణ చేసిన పోలీసులు తాజాగా పీటర్ ముఖర్జియాను అరెస్టు చేయడం విశేషం. దీంతో మరెన్ని నిజాలు వెలుగు చూస్తాయోనని అంతా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. విచారణ సందర్భంగా తరచూ స్టేట్ మెంట్ మార్చినందుకు పీటర్ ను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు చెబుతున్నప్పటికీ, హత్య కేసులో పీటర్ ముఖర్జియా హస్తం కూడా ఉందేమోనన్న అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.