: ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో భారత్ స్థానం అలాగే వుంది!
ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో టాప్ టెన్ లో 14వ సారి భారత్ చోటు సంపాదించుకుంది. గ్లోబల్ టెర్రరిజమ్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో 162 దేశాలు చోటు సంపాదించుకున్నాయి. ఈ జాబితాలో భారత్ ఆరవ స్థానం సంపాదించుకుంది. గత 14 సంవత్సరాలుగా భారత్ టాప్ టెన్ లో చోటు సంపాదించడం విశేషం. ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో సగానికిపైగా దాడులు ఐఎస్ఐఎస్, బోకోహరమ్ తీవ్రవాద సంస్థలే చేస్తున్నాయని గ్లోబల్ టెర్రరిజమ్ ఇండెక్స్ పేర్కొంది. 2014లో భారత్ లో సంభవించిన 763 ఉగ్రవాద ఘటనల్లో 416 మంది మృతిచెందారు. భారత్ లో జరుగుతున్న ఈ ఉగ్రదాడులకు పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు కారణమని ఈ జాబితా పేర్కొంది.