: ‘కాంగ్రెస్’ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ కష్టపడుతోంది!: మండిపడ్డ సోనియాగాంధీ


కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రభుత్వం, దాని గురువులు కష్టపడి పనిచేస్తున్నారంటూ సోనియా గాంధీ మండిపడ్డారు. మతపరమైన విభేదాలను తీసుకొచ్చి ప్రజల మధ్య అన్యోన్య వాతావరణం లేకుండా చేస్తోందంటూ బీజేపీ సర్కార్ పై ఆమె మండిపడ్డారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ, ఇందిరాగాంధీని ‘మదర్ ఆఫ్ మిలియన్స్’ అంటూ ఆమె ప్రశంసించారు. చరిత్రలో ఆమె స్థానం పదిలంగా ఉంటుందన్నారు. ఈరోజుకి కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆమెను అమ్మగా గుర్తుంచుకున్నారన్నారు. మన దేశ చరిత్రతో సంబంధమున్న పార్టీ కాంగ్రెస్ అని ఆమె అన్నారు. అటువంటి పార్టీకి చెందిన జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఇతర ప్రముఖ నేతలపై బురదజల్లేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఆ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వమన్నారు. మతపరమైన అంశాలతో ముందుకెళ్తున్న బీజేపీకి ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ప్రజలు షాకిచ్చిన విషయాన్ని సోనియా గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News