: 24 గంటల్లో 20 లక్షల మందికి చేరువైన అక్షయ్ 'ఎయిర్ లిఫ్ట్'
బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ తాజా సినిమా 'ఎయిర్ లిఫ్ట్' టీజర్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియా ద్వారా విడుదలైన 24 గంటల్లో 20 లక్షల మంది దీనిని చూడడం విశేషం. కువైట్-ఇరాక్ యుద్ధం సమయంలో ఇరాక్ లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా అల్లుకున్న కథాంశంతో రూపొందిన 'ఎయిర్ లిఫ్ట్' టీజర్ ను అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ కూడా అందర్నీ అలరించేలా, హాలీవుడ్ సినిమా పోస్టర్ లా ఉండడం విశేషం. ఎన్నో అంచనాలతో విడుదలైన తన 'బ్రదర్స్' సినిమా నిరాశపర్చడంతో ఈ సినిమాపై అక్షయ్ కుమార్ ఆశలు పెట్టుకున్నాడు. వచ్చే జనవరి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.