: రైలు 'బ్రేక్'కు బ్రేకేసిన ఎర్ర చీమలు!


ముంబయి లోకల్ ట్రెయిన్ బ్రేక్ కేబుల్స్ ను ఎర్రచీమలు తినేశాయి. దీంతో బ్రేకు పడకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంలో రైలు వేగాన్ని అదుపులోకి తెచ్చిన సంఘటన ముంబయిలో జరిగింది. ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం సుమారు 1.30 గంటల ప్రాంతంలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ పరిధిలోని ఒక లోకల్ ట్రెయిన్ లో చోటుచేసుకుంది. ఈ విషయమై సెంట్రల్ రైల్వే (సీఆర్) అధికారి ఒకరు మాట్లాడుతూ, "ఎలక్ట్రో న్యూమాటిక్ (ఈపీ) బ్రేక్ కు కనెక్టయి ఉండే కేబుళ్లలో ఒకటి సరిగా పనిచేయకపోవడాన్ని మాతుంగా ప్రాంతాన్ని దాటిన కొద్ది సేపటికి లోకల్ ట్రెయిన్ డ్రైవర్ గుర్తించాడు. ప్రధానమైన ఈపీ బ్రేక్ పనిచేయకపోవడంతో ప్రత్యామ్నాయమైన రెండో బ్రేక్ ను ఉపయోగించి ఎటువంటి ప్రమాదం జరగకుండా ట్రెయిన్ డ్రైవర్ గట్టెక్కించాడు" అన్నారు. ఈపీ బ్రేక్ ఫెయిలైనంత మాత్రాన భయపడాల్సిన పనిలేదని, ప్రత్యామ్నాయంగా మూడు బ్రేకులు ఉన్నాయని చెప్పారు. చీమల బాధ లేకుండా ఉండేందుకు పెస్ట్ కంట్రోల్ ను అనుసరిస్తున్నప్పటికీ ఇబ్బంది తప్పట్లేదని సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News