: 'ఎర్ర'బడ్డ సుకుమా జిల్లా...ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టుల మృతి!


ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లా రక్తంతో 'ఎర్ర'బడింది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన సుకుమా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాలను తీవ్రంగా ప్రతిఘటించిన మావోయిస్టులు ఓటమిపాలయ్యారు. ఈ కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు చెందిన భారీ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పులను బస్తర్ ఐజీ ఎస్సార్సీ కల్లూరి నిర్ధారించారు. మృతుల్లో మహిళా మావోయిస్టు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News