: బీబీసీ 100 మంది మహిళల జాబితాలో ఆశా భోస్లే, సానియా మీర్జా


భారత మహిళలు తమ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ ఏడాది బీబీసీ రూపొందించిన ప్రభావశీలురైన వంద మంది మహిళల జాబితాలో మన దేశానికి చెందిన ఏడుగురికి స్థానం దక్కింది. అందులో ప్రముఖ గాయకురాలు ఆశా భోస్లే, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, వెటరన్ ఆర్టిస్టు కామిని కౌశల్, రింపీ కుమారి (రాజస్థాన్ రైతు), స్మృతి నాగ్ పాల్ (ఎంటర్ ప్రెన్యూర్), ముంతాజ్ షేక్ (క్యాంపెయినర్), కనికా టెక్రీవాల్ (ఎంటర్ ప్రెన్యూర్)లు ఉన్నారు. కాగా, రాజకీయాలు, సైన్స్, వినోద రంగాలలో ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను కనబరిచిన వారిని బీబీసీ ఎంపికచేస్తుంది. ఆయా రంగాల్లో వారు చేసిన కృషి, అంకిత భావంతో పనిచేసిన తీరు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ జాబితాను బుధవారం బీబీసీ ప్రతినిధులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News