: ముగిసిన వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం... పోలింగ్ కు సర్వం సిద్ధం
హోరాహోరీగా సాగిన వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెర పడింది. గత 15 రోజులుగా అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించాయి. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ తరపున దయాకర్, ఎన్డీయే తరపున దేవయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ, వైకాపా తరపున నల్లా సూర్యప్రకాశ్ బరిలోకి దిగారు. తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే లక్ష్యంతో అన్ని పార్టీల ప్రధాన నేతలు ప్రచార కార్యరంగంలోకి దూకారు. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. 15,09,671 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 1,778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.