: నన్ను ఇబ్బంది పెట్టిన బ్యాట్స్ మన్ డివిలియర్సే: మిచెల్ జాన్సన్


తన కెరీర్లో ఇబ్బంది పెట్టిన బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ అని ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ తెలిపాడు. తాజాగా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మిచెల్ జాన్సన్ తన కెరీర్ పై మాట్లాడాడు. 2014లో సఫారీలతో సెంచూరియన్ లో జరిగిన టెస్టులో వైవిధ్యమైన బంతులతో సౌతాఫ్రికా ఆటగాళ్ల కీలక వికెట్లు చేజిక్కించుకున్నానని, అయితే ఎలాంటి బంతులు విసిరినా డివిలియర్స్ మాత్రం సహజశైలిలో ఆడాడని గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో జాన్సన్ 12 వికెట్లు తీసి సత్తాచాటినా డివిలియర్స్ దూకుడును మాత్రం అడ్డుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో 91 పరుగులు చేసిన డివిలియర్స్, రెండో ఇన్నింగ్స్ లో 48 పరుగులు చేశాడు. కాగా, కెరీర్ లో 313 వికెట్లు తీసిన మిచెల్ జాన్సన్, ఆస్ట్రేలియా టాప్ 10 బౌలర్ల జాబితాలో నాలుగవ బౌలర్ గా నిలిచాడు.

  • Loading...

More Telugu News