: బీహార్ ఓటమికి ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలే కారణం: పాశ్వాన్
బీహార్ శాసనసభ ఎన్నికల్లో పరాభవం తర్వాత ఓటమికి గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు ఎన్డీఏ నేతలు. ఈ క్రమంలో, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతే ఎన్డీయే ఓటమికి కారణమని కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధినేత రామ్ విలాశ్ పాశ్వాన్ తేల్చి చెప్పారు. రిజర్వేషన్లను పునస్సమీక్షించాలని పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలో బీహార్ ఓటర్లలో భయాందోళనలు రేకెత్తించాయని... అందువల్లే అప్పటి వరకు ఎన్డీయే పక్షాన ఉన్న ఓటర్లు కూడా నితీష్ కుమార్ కూటమికి ఓటు వేశారని తెలిపారు. రిజర్వేషన్లకు తాము అనుకూలంగానే ఉన్నామని వెనుకబడిన కులాల ఓటర్లకు చెప్పడంలో విఫలమయ్యాయని చెప్పారు. మరోవైపు బీహార్ ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీ చేసిన ఎల్జేపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. అంతకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎల్జేపీ 7 స్థానాల్లో పోటీ చేస్తే 6 స్థానాల్లో గెలుపొందింది. ఎల్జేపీకి వెనకబడిన తరగతుల ఓట్లే అత్యంత కీలకం.