: ఏ సినిమా చూడాలో ప్రేక్షకులకు తెలియదా?: వర్మ సెటైర్
'జేమ్స్ బాండ్' తాజా సినిమా 'స్పెక్టర్' సెన్సార్ కట్ లపై రాంగోపాల్ ఘాటుగా స్పందించాడు. సోషల్ మీడియాలో జేమ్స్ బాండ్ సినిమాపై సెన్సార్ సూచించిన కట్ లపై వర్మ అభ్యంతరం చెప్పాడు. సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా ప్రేక్షకులను వేలి ముద్రలు వేసే వాళ్లుగా చూస్తోందని మండిపడ్డాడు. మాట్లాడలేని బాలలుగా భావిస్తోందని అభిప్రాయపడ్డాడు. సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఇదే సరైన సమయం అని వర్మ సూచించాడు. ఏం చూడాలో, ఏం చూడకూడదో నిర్ణయించుకుని, ఆలోచించుకునే వ్యక్తులుగా ప్రేక్షకులను గుర్తించాలని కోరాడు. సొంత ప్రభుత్వాన్ని ఎన్నుకునే వివేచన ఉన్నప్పుడు ఏ సినిమా చూడాలో నిర్ణయించుకోలేరా? అని రాంగోపాల్ వర్మ నిలదీశాడు. మొత్తానికి 'స్పెక్టర్'లో ముద్దు సీన్లపై కట్ లు సూచించడం రామూకి రుచించలేదు... అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.