: రాష్ట్రంలో వరద నష్టంపై కేంద్ర సాయం కోరిన చంద్రబాబు... తక్షణమే రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని లేఖ
ఆంధ్రప్రదేశ్ లో వరద నష్టంపై సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరారు. పునరావాసం, పునర్ నిర్మాణ పనులు చేపట్టేందుకు తక్షణమే రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, రాధామోహన్ సింగ్ లకు లేఖ రాశారు. ప్రాథమిక అంచనా మేరకు రాష్ట్రంలో రూ.3వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. సమగ్ర అధ్యయనం తరువాత పూర్తిస్థాయి నివేదిక పంపిస్తామని లేఖలో సీఎం పేర్కొన్నారు. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కడప, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.