: ఇండిగో విమానంలో తాగుబోతుల హల్ చల్
ఇండిగో విమానంలో ముగ్గురు తాగుబోతులు హల్ చల్ చేశారు. హిందూ మహాసభ నేత సహా ఇద్దరు న్యాయవాదులు పూటుగా మద్యం తాగి కోయంబత్తూరు నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం ఎక్కారు. విమానం బయల్దేరిన తరువాత వీరు సాటి ప్రయాణికులతో అభ్యంతరకరంగా వ్యవహరించారు. ఎయిర్ హోస్టెస్ ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. వీరి ప్రయత్నాన్ని అడ్డుకున్న వారితో గొడవకు దిగారు. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.