: 78 ఐఎస్ఐఎస్ ఛానల్స్ ను బ్లాక్ చేసిన 'టెలిగ్రామ్'


తమ యాప్ ద్వారా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత వారం రోజుల నుంచి శ్రమించి 12 భాషల్లో ఇస్లామిక్ స్టేట్ కి సంబంధించిన 78 ఛానెళ్లను బ్లాక్ చేసినట్టు ట్విట్టర్ లో వెల్లడించింది. తమ యాప్ సర్వీసు ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. ఇలా ఈ యాప్ వినియోగించి తమ యూజర్లను ఐఎస్ వైపు ఆకర్షించకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు టెలిగ్రామ్ తెలిపింది. బెర్లిన్ కేంద్రంగా పనిచేసే ఈ టెలిగ్రామ్ యాప్ లో ఒకేసారి 200 మందితో గ్రూప్ చాటింగ్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News