: జగన్ కంపెనీల పెట్టుబడి వ్యవహారాల్లో విజయసాయి కీలకం: సీబీఐ


వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి నిధులు రావడానికి ఆడిటర్ విజయసాయిరెడ్డిది ప్రధాన పాత్రని సీబీఐ కోర్టుకు సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. అన్ని ఛార్జిషీట్ లు ఒకేసారి విచారణ చేయాలంటూ సీబీఐ కోర్టులో జగన్, విజయసాయిరెడ్డిలు మోమోలు దాఖలు చేశారు. దీనిపై ఈరోజు వాదనలు జరిగాయి. జగన్ కంపెనీల్లో 'క్విడ్ ప్రోకో' ('నీకిది-నాకిది') కింద పెట్టుబడులు వచ్చాయనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయని సీబీఐ ఈ సందర్భంగా తెలిపింది.

ఇప్పటివరకూ ఈ కేసులో 5 ఛార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ మరో ఆరు అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపింది. దాల్మియా, వాన్ పిక్ లపై దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ప్రస్తుతం మంత్రులు నిందితులుగా ఉన్నారని అధికారులు చెప్పారు. అయితే జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులకు పలు రకాల కుట్రలు ఉన్నాయని వివరించింది.

  • Loading...

More Telugu News