: భారతీయ జేమ్స్ బాండ్ పై జోకులు!
'జేమ్స్ బాండ్' తాజా సినిమా 'స్పెక్టర్' భారత్ లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారతీయ సెన్సార్ బోర్డు ఆ సినిమాలో పలు అభ్యంతరకర సన్నివేశాలకు కట్ చెప్పింది. ఇది సోషల్ మీడియాలో టాప్ స్టోరీ అయి కూర్చుంది. నెటిజన్లు తమ క్రియేటివిటీ ఉపయోగించి 'భారతీయ జేమ్స్ బాండ్' ఎలా ఉంటాడు? అనే ఊహాత్మక చిత్రాలు రూపొందించారు. భారతీయ 'జేమ్స్ బాండ్' పాత్రపై భారతీయుల సృజనాత్మకతపై బీబీసీ కథనం ప్రసారం చేసేంతగా ఆ చిత్రాలు పాప్యులర్ అయ్యాయి. భారతీయ జేమ్స్ బాండ్ నుదుట విభూది రేఖలు ధరించి ఉంటాడని, అతని ప్రధాన ఆయుధం త్రిశూలం అవుతుందని, బాండ్ గాళ్స్ గాగ్రఛోళీ ధరించి ఉంటారని, అలాగే జేమ్స్ బాండ్ సినిమాలో తప్పని సరిగా ఉండాల్సిన డైలాగ్ 'మేరా పాస్ మా హై' అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. సెన్సార్ బోర్డు చెప్పిన అభ్యంతరాలు నెటిజన్లను బాగా బాధించినట్టు కనపడుతోంది.