: జాగ్రత్త! ముష్కరులు జీవ, రసాయనిక ఆయుధాలు ఉపయోగించవచ్చు!: ఫ్రెంచ్ ప్రధాని హెచ్చరిక


రసాయనిక, జీవాయుధాలతో ఫ్రాన్స్ లో దాడులు జరిగే అవకాశముందని, జాగ్రత్తగా ఉండాలని ఫ్రెంచ్ ప్రధాని మాన్యయేల్ వాల్స్ హెచ్చరించారు. పారిస్ లో అత్యవసర పరిస్థితి పొడిగింపు అనే విషయమై గురువారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాడులకు తెగబడే ముష్కరులు రసాయనిక, జీవాయుధాలను ఉపయోగించే ప్రమాదముందన్నారు. పారిస్ లో జరిగిన ‘ఉగ్ర’ దాడులపై యూరోప్ అంతటా దర్యాప్తు, విచారణ జరుగుతోందన్నారు. విమాన ప్రయాణికుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అవసరమైన చర్యలను తక్షణం తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ)ను ఆయన కోరారు. కాగా, ఫ్రాన్స్ లో ని పోలీసులు ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా వారి వెంట ఆయుధాలు ఉంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ‘ఉగ్ర’ దాడులు జరిగే సందర్భంలో పోలీసులు తమ తుపాకులు ఉపయోగించవచ్చని, ఆ సమయంలో పోలీసులు ఆర్మ్ బ్యాండ్ ధరించాలని... తద్వారా ప్రజలు అయోమయానికి గురయ్యే పరిస్థితులు ఉండవని అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News