: ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి విజయ్ ను వదిలిపెట్టిన పోలీసులు


ఉస్మానియా యూనివర్సిటీ ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ ను పోలీసులు వదిలి పెట్టారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం వద్ద అతడిని, మరో ఇద్దరు స్నేహితులను విడిచిపెట్టారు. అతని నుంచి హామీ పత్రం తీసుకున్నట్టు సమాచారం. కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన విజయ్... ఇటీవల వరంగల్ లో జరిగిన కేసీఆర్ సభలో నిరసన తెలిపాడు. ఈ క్రమంలో అతనికి మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు తల్లిదండ్రులను కూడా అరెస్టు చేశారని తెలిసింది. తరువాత గంటకే వారిని వదిలిపెట్టారట.

  • Loading...

More Telugu News