: తుపాను బాధితులకు భరోసా ఇవ్వనున్న జగన్: బొత్స
తెలుగుదేశం ప్రభుత్వంపై వైకాపా నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తుపాను సూచన ఉన్నప్పటికీ, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, జన జీవనం కకావికలమైందని అన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనికితోడు, తుపాను బాధితులను ఆదుకోవాలని తమ అధినేత జగన్ ఇప్పటికే వైకాపా శ్రేణులకు పిలుపునిచ్చారని బొత్స తెలిపారు. అంతేకాకుండా, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు జగన్ భరోసా ఇవ్వనున్నారని వెల్లడించారు.