: చింటూ రాయల్ పై రెడ్ కార్నర్ నోటీసులు... మరో ఇద్దరిపై కూడా!


టీడీపీ చిత్తూరు జిల్లా కీలక నేత కఠారి మోహన్.. ఆయన సతీమణి, చిత్తూరు నగర మేయర్ అనురాధల హత్య కేసు నిందితుల వేట మొదలైంది. నిన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు నిందితుల అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో దాడి జరిగిన కొద్దిసేపటికే ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఈ ఘటనలో కీలక నిందితుడు మోహన్ మేనల్లుడు చింటూ రాయల్ (చంద్రశేఖర్) పరారీలో ఉన్నాడు. చింటూనే స్వయంగా తన అత్త అనురాధను కాల్చేయడంతో పాటు మేనమామ మోహన్ పైనా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో అతడిని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అతడు దేశం విడిచి పారిపోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చింటూ రాయల్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై చిత్తూరు జిల్లా పోలీసులు కొద్దిసేపటి క్రితం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News