: సర్వీసులో చేరిన తొలి పదేళ్లలో ఐఏఎస్ లు సత్తా చాటాలి: మోదీ


2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గ నిర్దేశం చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న వారినుద్దేశించి ఢిల్లీలోని డీఆర్ డీవోలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న అధికారులు తామేంటో నిరూపించుకోవాలన్నారు. సర్వీసులో చేరిన తరువాత మొదటి పది సంవత్సరాలు చాలా కీలకమని, ఈ సమయంలోనే సత్తా చాటాలని అన్నారు. వృత్తి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, సుదీర్ఘకాలం ప్రజలతో సత్సంబంధాలు నెరపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అధికారులు చేస్తున్న పనులకు దుష్టశక్తులు ఆటంకాలు సృష్టిస్తాయని, కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఐఏఎస్ అధికారులు చేసేపని నిజాయతీ, చిత్తశుద్ధితో చేయాలని మోదీ సూచించారు.

  • Loading...

More Telugu News