: ప్రకృతి సృష్టించిన మహాద్భుతం, ప్రవహిస్తున్న ఇసుక నది... మీరూ చూడండి!
ప్రకృతిలో అందాలెన్నో మనకు తెలుసు. వాటిల్లో ఎన్నో అద్భుతాలూ ఉన్నాయి. కానీ దీన్ని మహాద్భుతం అనొచ్చేమో! ఎన్నో రహస్యాలు దాగున్న భూమండలంలో ఎప్పుడో, ఎక్కడో ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అదే ఈ 'ఇసుక నది'. ఇసుక నదీ ప్రవాహం మాదిరిగా కదలడం మీరు ఎక్కడైనా చూశారా? ఈ అద్భుతం ఇరాక్ లో జరిగింది. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇప్పుడిది సామాజిక మాధ్యమాల్లో శరవేగంగా చక్కర్లు కొడుతోంది. ఇరాక్ లో కురిసిన భారీ వర్షాల కారణంగానే ఇది సంభవించివుండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.