: బీజేపీ నేతల మాటలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: కడియం శ్రీహరి
పత్తికి మద్దతు ధర ప్రకటించే అధికారం కేంద్రానికే ఉంటుందని... అయితే, ఆ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అన్నట్టుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని... వారి మాటలు విన్న ప్రజలు నవ్వుకుంటున్నారని టీఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో డిపాజిట్లు కూడా రావనే భయంతోనే కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. తాము ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని వరంగల్ ఓటర్లను కడియం శ్రీహరి కోరారు. వరంగల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.