: మెగా హీరోయిన్ సినిమా ఓపెనింగ్ కు మెగా హీరోలంతా డుమ్మా
మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. చిరంజీవి సోదరుడు నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న 'ఒక మనసు' అనే సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ మూవీ లాంచింగ్ ప్రోగ్రామ్ కు మెగా హీరోల్లో ఒకరు కూడా హాజరు కాలేదు. కేవలం నిహారిక తల్లిదండ్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ కార్యక్రమానికి మెగా హీరోలెవరూ రాకపోవడం వెనక ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? అనే కోణంలో ఆరా తీసే పనిలో పడ్డారు సినీ విశ్లేషకులు.