: ఉప ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్న విజయకాంత్!
తమిళనాట తిరిగి అధికారంలోకి రావాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్న డీఎంకే పార్టీ చిన్న పార్టీలను కలుపుకుపోవాలన్న లక్ష్యంతో చర్చలు జరుపుతుంటే, డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం, తమ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తేనే చేతులు కలుపుతామన్న సంకేతాలు పంపారు. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ దూతలతో విజయకాంత్ సతీమణి ప్రేమలత స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక డీఎంకే కోశాధికారి హోదాలో ఉన్న నేత స్టాలిన్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ, జయలలిత విధానాలను ఎండగడుతున్నారు. ఆయన దారిలోనే కరుణానిధి కుమార్తె కనిమోళి సైతం పర్యటనలు ప్రారంభించనున్నారని తెలుస్తోంది. సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను కలుపుకుంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడవచ్చని భావిస్తున్న కరుణానిధి, విజయకాంత్ ప్రతిపాదనకు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.