: ఫ్రాన్స్, రష్యా దాడుల్లో 33 మంది యుద్ధ వీరులు మరణించారు... ప్రతీకారం ఇదిగో!
తన స్థావరాలపై రష్యా, ఫ్రాన్స్ దేశాలు జరిపిన బాంబు దాడుల్లో 33 మంది ఫైటర్లు మరణించారని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నామని చెబుతూ, తమ వద్ద బందీలుగా ఉన్న ఓ చైనీయుడిని, మరో నార్వేజియన్ ను క్రూరంగా హతమార్చి వారి చిత్రాలను విడుదల చేశారు. వీరు చైనాకు చెందిన ఫాన్ జింగుయ్, నార్వేకు చెందిన ఓలే జోహాన్ గ్రిమ్స్ గార్డ్ గా గుర్తించారు. వీరి మృతదేహాల ఫుల్ పేజీ ఫోటోలను 'దబీఖ్' మ్యాగజైన్ లో ప్రచురించిన ఐఎస్ఐఎస్, "ఇస్లాంపై నమ్మకంలేని దేశాలు, సంస్థలకు వ్యతిరేకంగా చంపేశాం" అని క్యాప్షన్ పెట్టింది. ఈ హత్యలు ఎప్పుడు జరిగాయన్నది స్పష్టంగా తెలియనప్పటికీ, వారి తలల్లోకి పలుమార్లు కాల్చినట్టు తెలుస్తోంది. ఈ దృశ్యాలపై నార్వే స్పందించింది. వారు ఏ మాత్రమూ మానవత్వం లేనివారిలా ప్రవర్తిస్తున్నారని ఆ దేశ ప్రధాని కార్యాలయం వ్యాఖ్యానించింది. ఈ హత్యను చైనా తీవ్రంగా ఖండించింది. కాగా, దబీఖ్ సెప్టెంబరు సంచికలో వీరిద్దరి సజీవ చిత్రాలను ప్రచురించిన ఐఎస్ఐఎస్ 'అమ్మకానికి' అంటూ హెడ్డింగ్ పెట్టింది.