: రష్యా విమానంలో బాంబెలా పెట్టామంటే... ఐఎస్ఐఎస్ సవివర కథనం!


మాస్కోకు వెళుతున్న రష్యా విమానాన్ని ఎలా పేల్చామన్న విషయమై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ ఆన్ లైన్ మ్యాగజైన్ 'దబీఖ్'లో ప్రత్యేక కథనం ప్రచురించారు. బాంబును విమానంలోకి చేర్చిన వారి పాస్ పోర్టుల చిత్రాలను కూడా ఉంచారు. గత నెల 31న సినాయ్ పెనిన్సులాలో ఈ విమానం గాల్లో పేలిపోయి కుప్పకూలిన ఘటనలో 224 మంది మరణించిన సంగతి తెలిసిందే. పేలుడు పదార్థాలను ఓ సోడా క్యాన్ లో పెట్టి విమానంలోకి చేర్చామని ఉగ్రవాదులు తెలిపారు. తొలుత ఓ అమెరికా విమానాన్ని టార్గెట్ చేయాలని భావించామని, అయితే, రష్యా సైతం తమపై దాడులు చేస్తుండటంతో ముందుగా ఆ దేశపు విమానాన్ని పేల్చామని స్పష్టం చేసింది. కాగా, విమానాన్ని ఉగ్రవాదులే పేల్చారని అంగీకరించిన రష్యా, అందుకు ప్రతీకారం తీర్చుకుని తీరుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News