: కేసీఆర్ ‘ఢిల్లీ కాన్వాయ్’లోకి కొత్త కారు... మూడూ మూడు వేర్వేరు కంపెనీలవి!


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుది ముమ్మాటికీ విభిన్న శైలే. సాధారణంగా ప్రముఖుల కాన్వాయ్ లో ఉండే వాహనాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. భద్రత కారణాల రీత్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు, కాన్వాయ్ లోని కార్లన్నీ దాదాపుగా ఒకేలా కనిపిస్తాయి. ఒకే కంపెనీకి చెందిన ఈ కార్ల నెంబర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా దాదాపు అందరు ప్రముఖుల కాన్వాయ్ తీరు కూడా ఇదే. అయితే, కేసీఆర్ ఢిల్లీలో వినియోగిస్తున్న కాన్వాయ్ ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా రెండు కార్లతో ఉన్న కేసీఆర్ ఢిల్లీ కాన్వాయ్ లో నిన్న ఓ కొత్త కారు వచ్చి చేరింది. మొన్నటిదాకా ఉన్న రెండు కార్లు కూడా రెండు వేర్వేరు కంపెనీలకు చెందినవే. వాటిలో ఒకటి టాటా సఫారీ కాగా, మరొకటి మహీంద్రా స్కార్పియో. తాజాగా నిన్న చేరిన మూడో కారు మూడో కంపెనీకి చెందినది. ఈ కారు టయోటా ఫార్చునర్ మోడల్. కాన్వాయ్ లోని మూడు కార్లు మూడు కంపెనీలకు చెందినవే కాక, మూడూ మూడు రకాలుగా కనిపిస్తున్న వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

  • Loading...

More Telugu News