: రాజయ్య దంపతుల బెయిల్ పిటిషన్ కొట్టివేత
కోడలు సారిక, మనవలు అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. బెయిల్ నిమిత్తం రెండో అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, సారిక భర్త అనిల్ పోలీసు కస్టడీలో ఉండగా..రాజయ్య దంపతులు వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. సుమారు పదమూడు రోజుల క్రితం సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు, మనవలు ముగ్గురు సజీవదహనమైన విషయం తెలిసిందే.