: ఇకపై రైల్వే డ్రైవర్లకు సీయూజీ సిమ్ కార్డులు!


ఇకపై లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల ఫోన్ కాల్ రికార్డుల వివరాలను రైల్వే అధికారులు పరిశీలించనున్నారు. రైలు నడిపే సమయంలో డ్రైవర్లు ఫోన్లు వినియోగిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునే నిమిత్తం ఈ కాల్ డేటాను సేకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. భారతీయ రైల్వే వ్యవస్థలో భద్రతా ప్రమాణాలు పెంచే చర్యల్లో భాగంగానే ఈ వినూత్న కార్యక్రమానికి భారతీయ రైల్వే తెరతీసిందని ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వేలో పని చేస్తున్న మొత్తం లోకో పైలెట్లకు, అసిస్టెంట్ లోకో పైలెట్లకు రైల్వే సీయూజీ సిమ్ కార్డులను అందించనుందని, ప్రత్యేక నెంబర్లు కేటాయించనుందని పేర్కొన్నారు. కాగా, నిబంధనల ప్రకారం రైలు నడిపే సమయంలో రైలు డ్రైవర్లు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News