: మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న ఉపాధ్యాయురాలు అరెస్టు
ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తనకు జరిగిన మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి రెండో వివాహం చేసుకుంది. ఈ విషయమై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. ఈ సంఘటన విశాఖపట్టణంలోని సిరిపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన రమాదేవి(26) ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. పెళ్లి సంబంధాల కోసం ఓ మ్యాట్రిమోనిలో తన వివరాలు ఇచ్చింది. విశాఖలోని సిరిపురానికి చెందిన ఎడ్ల శ్రీనివాస్(29) కూడా పెళ్లి ప్రయత్నాల్లో ఉండటం... ఆమెకు సంబంధించిన వివరాలు నచ్చడం జరిగాయి. రమాదేవిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో 2012లో రమాదేవి- శ్రీనివాస్ ల వివాహం జరిగింది. పెళ్లైన మూడు రోజులకే రమాదేవి పుట్టింటికి వెళ్లిపోయింది.. మళ్లీ తిరిగి రాలేదు. ఆమె వస్తుందని ఎదురు చూసి విసిగిపోయిన శ్రీనివాస్ పెద్దాపురం వెళ్లాడు. అక్కడికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. 2003లో ఆమెకు మొదటి వివాహమైన సంగతి తెలిసింది. మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకోవడం, మొదటి పెళ్లి విషయం శ్రీనివాస్ కు చెప్పకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రమాదేవిని, ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.