: పరిపాలన సరిగ్గా లేని, హామీలు నిలబెట్టుకోని పార్టీలకు ఓటెయ్యద్దు : వైఎస్ జగన్


రుణమాఫీ అమలు చేస్తామని మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీకి, పరిపాలన సవ్యంగా లేని టీడీపీకి, ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీకి ఓట్లు వేయవద్దంటూ వైఎస్సార్సీపి అధినేత జగన్ కోరారు. వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లడారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే విలువలు కోల్పోతామని ఆ పార్టీకి అస్సలు ఓటేయవద్దని అన్నారు. కేవలం ఓటు అడిగే హక్కు వైఎస్సార్సీపికే ఉందని, తమ పార్టీ అభ్యర్థి సూర్యప్రకాశ్ ను గెలిపించాలని కోరారు. తెలంగాణలో ఒకేసారి రుణమాఫీ చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారన్నారు. ఏడాది క్రితం ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు ఈరోజున మండిపోతున్నాయని, అందుకు కారణం ఈ ప్రభుత్వాలేనని మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఈ సమస్యలుండవని జగన్ అన్నారు.

  • Loading...

More Telugu News