: నైజీరియాలో ‘బొకో హారమ్’ బాంబుల దాడి: 32 మంది మృతి
ఉగ్రవాద సంస్థ బొకో హారమ్ నైజీరియాలో బాంబుల వర్షం కురిపించింది. ఒక మార్కెట్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో యువకులే అధికంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ బాంబుదాడికి ముందు ఓ మహిళా ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1000మందికి పైగా అమాయకులు బలయ్యారు. బుహారీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బొకో హారమ్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.