: న్యూజిలాండ్ రగ్బీ దిగ్గజం జోనా లోము కన్నుమూత
న్యూజిలాండ్ రగ్బీ దిగ్గజ ఆటగాడు జోనా లోము(40) కన్నుమూశాడు. ఇవాళ ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్టు న్యూజిలాండ్ రగ్బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ ట్యూ తెలిపారు. నిన్ననే స్వదేశానికి తిరిగొచ్చిన ఆయన ఇంతలోనే చనిపోవడం బాధాకరమని స్టీవ్ అన్నారు. గతంలో కొంతకాలం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడిన లోముకు 2004లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లోము అకాల మరణం పట్ల పలువురు ప్రముఖులు, తోటి ఆటగాళ్లు సంతాపం తెలిపారు.