: సాకర్ వీరుడు డేవిడ్ బెక్‌హామ్ కు కొత్త బిరుదు!
ప్రపంచంలో జీవించి ఉన్న వ్యక్తుల్లో 'సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్'గా బ్రిటిష్ సాకర్ లెజెండ్ డేవిడ్ బెక్ హామ్ నిలిచారు. అమెరికాకు చెందిన పీపుల్ మ్యాగజైన్ ఈ టైటిల్ కి ఆయన్ని ఎంపిక చేసింది. మ్యాగజైన్ 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఈ టైటిల్‌ను బెక్ హామ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా బెక్ హామ్ మాట్లాడుతూ, ‘ఈ పురస్కారం నాకు లభించడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. నేను అందంగా, సెక్సీ గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. నా భార్య విక్టోరియా మద్దతుతోనే ఈ టైటిల్ లభించింది’ అని అన్నాడు. కాగా, 40 ఏళ్ల బెక్‌హామ్ పెప్సీ, ఆడిదాస్ వంటి ప్రముఖ వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. జార్జియో ఆర్మానీ అండర్‌వేర్‌లకు మోడల్‌గా కూడా వ్యవహరించాడు. బెక్ హామ్ భార్య విక్టోరియా ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ కావడంతో తన భర్త అందంగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు.