: హత్యా రాజకీయాలను ఉపేక్షించేది లేదు: చంద్రబాబు


చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతులను పథకం ప్రకారమే హత్య చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని చెప్పారు. అయితే ఈ హత్యల వెనుక ఎంతటివారున్నా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. చిత్తూరులో మేయర్ దంపతుల భౌతికకాయాలకు ఈరోజు చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, హత్యా రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. చిత్తూరులో రౌడీమూకలు పేట్రేగకుండా కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు ఘటన జరిగిన మేయర్ ఛాంబర్ ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. కేసు గురించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News