: విధి నిర్వహణలో అసువులు బాసిన ఫ్రాన్స్ పోలీసు శునకం ‘డీజిల్’!


ఫ్రాన్స్ యాంటి-టెర్రర్ సంస్థ ఆర్ఏఐడీకి చెందిన శునకం 'డీజిల్'ను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. పారిస్ ఉగ్రదాడుల సూత్రధారి అబ్దెల్ హమీద్ కోసం ఈ తెల్లవారుజాము నుంచి ఉత్తర పారిస్ లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడి సెయింట్ డెనిస్ ప్రాంతంలోని పలు అపార్టుమెంట్లపై భద్రతా దళాలు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ‘డీజిల్’ను టెర్రరిస్టులు కాల్చివేశారు. ఏడు సంవత్సరాల వయస్సు కల్గిన ‘డీజిల్’కు పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. బెల్జియన్ మాలిన్వాస్ జాతికి చెందిన ‘డీజిల్’ మృతిపై ఆర్ఏడీ అధికారులు, ఫ్రాన్స్ నేషనల్ పోలీలు విచారం వ్యక్తం చేశారు. ‘డీజిల్’ మృతి విషయమై ఫ్రాన్స్ నేషనల్ పోలీసు, ఆర్ఏడీ లు వేర్వేరు ట్వీట్లు చేశాయి. ఈ ట్వీట్లు ఫ్రెంచి భాషలో చేశారు. ‘డీజిల్’ మృతిపై నెటిజన్లు విచారం వ్యక్తం చేశారు. కాగా, పారిస్ ఉగ్ర దాడులకు సూత్రధారి అయిన అబ్దెల్ హమీద్ ను ఫ్రాన్స్ భద్రతా దళాలు మట్టుబెట్టాయి. హమీద్ ను మట్టుబెట్టే క్రమంలో భద్రతాదళాల సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News