: ఫ్రాన్స్ విమానంలో బాంబు హెచ్చరిక ఉత్తుత్తిదే!


అమెరికా నుంచి ఫ్రాన్స్ కు వస్తున్న రెండు విమానాల్లో ఒక దానికి బాంబు భయం లేదని ఏవియేషన్ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. నిన్న ఉదయం బాంబు బెదరింపుల కారణంగా ఈ రెండు విమానాలను దారి మళ్లించిన విషయం తెలిసిందే. లాస్ ఏంజిల్స్ నుంచి పారిస్ లోని ఛార్లెస్ డి గల్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం 65 ను, అదే సమయంలో వాషింగ్టన్ నుంచి బయలు దేరిన ఫ్రాన్స్ కు చెందిన మరో విమానం ఎయిర్ ఫ్రాన్స్ 55ను బాంబు భయం కారణంగా దారి మళ్లించారు. ఎయిర్ ఫ్రాన్స్ విమానం 65 ను సాల్ట్ లేక్ లో, ఎయిర్ ఫ్రాన్స్ 55ను కెనడాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతం హాలిఫాక్స్ కు మళ్లించారు. ఈ సందర్భంగా హాలిఫాక్స్ స్టాన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికార ప్రతినిధి పీటర్ స్పుర్వే మాట్లాడుతూ, ఎయిర్ ఫ్రాన్స్ 55కు ఎటువంటి బాంబు భయం లేదన్నారు. ప్రయాణికులకు హోటళ్లలో బస ఏర్పాటు చేశామన్నారు. ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం మేరకు ఆ విమానం బయలుదేరుతుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News