: మహిళలు కొంటెగా చూడడం వల్లే దాడులు: కాంగ్రెస్ నేత వక్రభాష్యం


దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్న వైనానికి మధ్యప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సరికొత్త భాష్యం చెప్పారు. బిండ్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో మాజీ మంత్రి సత్యదేవ్ కటారా మాట్లాడుతూ.. మహిళలు పురుషుల వైపు కొంటెగా చూస్తూ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. మహిళలు కొంటె చూపులు చూడకుంటే ఏ మగాడూ మహిళను వేధించడని వ్యాఖ్యానించారు. కటారా వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విశ్వాస్ త్యాగి ఖండించారు. ఇవి మహిళలను కించపరిచేవిగా వున్నాయని విమర్శించారు.

  • Loading...

More Telugu News