: తిరుమల బస్సుకు తప్పిన ప్రమాదం!
తిరుమల నుంచి కిందకు దిగుతున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్ నుంచి వస్తున్న బస్సు 32వ మలుపు దగ్గర డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో బస్సును తొలగించారు. అయితే, వాహనాల రాకపోకలకు కొంతమేరకు అంతరాయం కల్గింది. ఈ సంఘటనలో భక్తులకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. భక్తులందరూ సురక్షితంగానే ఉన్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.