: మణిశంకర్ అయ్యర్, ఖుర్షీద్ వ్యాఖ్యలను ఖండించిన వెంకయ్య


కాంగ్రెస్ సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, సల్మాన్ ఖుర్షీద్ లు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు రాజద్రోహం, జాతిని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, పొరుగు దేశానికి అనుకూలంగా మాట్లాడుతూ... ప్రజాస్వామికంగా ఎన్నికైన స్వదేశీ ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం జాతిని అవమానించడమేనని అన్నారు. అయ్యర్, ఖుర్షీద్ ల వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించి, ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News