: పారిస్ ఉగ్రదాడి సూత్రధారి అబ్దెల్ హమీద్ హతం


ఫ్రాన్స్ రాజధాని పారిస్ పై జరిపిన ఉగ్రదాడుల సూత్రధారి అబ్దెల్ హమీద్ అబోద్ హతమయ్యాడు. ఈ తెల్లవారుజాము నుంచి ఉత్తర పారిస్ లో అతని లక్ష్యంగా పారిస్ సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇక్కడ సెయింట్ డెనిస్ ప్రాంతంలోని ఓ అపార్టుమెంటులో అబోద్, మరికొందరు ఉగ్రవాదులు దాక్కున్నట్టు తెలుసుకున్న సైన్యం మాటు వేసింది. ముందుగా అపార్టుమెంటును చుట్టుముట్టి సైన్యం దాడి చేసింది. ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించగా, అపార్టుమెంటు నుంచి కూడా ఎదురు కాల్పులు వచ్చాయి. ఈ క్రమంలో అబోద్ సహా లోపలున్న ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఓ మహిళా ఉగ్రవాది కూడా ఉంది.

  • Loading...

More Telugu News