: 26 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరి దర్శకత్వంలో మరో హాలీవుడ్ చిత్రం!


1989లో వచ్చిన 'ది లిటిల్ మెర్ మెయిడ్' హాలీవుడ్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి దర్శకులుగా రోన్ క్లైమెంట్, జాన్ ముస్కీర్ వ్యవహరించారు. సుమారు 26 సంవత్సరాల తర్వాత వాళ్లిద్దరి దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రం 'మోనా'. ఈ చిత్రాన్ని వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ‘మోనో’ను వచ్చే ఏడాది నవంబర్ 23న విడుదల చేస్తున్నట్లు ఈ చిత్ర బృందం వెల్లడించింది. నాడు విడుదలైన ‘ది లిటిల్ మెర్ మెయిడ్’ కూడా వాల్ట్ డిస్నీ నిర్మించినదే!

  • Loading...

More Telugu News